Ad Code

విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన బాషా వివాదం


హారాష్ట్రలోని థానేలో హిందీ వర్సెస్‌ మరాఠీ బాషా వివాదం విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. అర్నవ్‌ ఖారే (19) ఫస్ట్‌ ఇయర్‌ డిగ్రీ సైన్స్‌ స్టూడెంట్‌. ప్రతీరోజూ ముంబైలోని ములంద్‌ ప్రాంతంలోని కాలేజ్‌కి వెళ్తూ వస్తున్నాడు. కానీ ఈ మధ్య క్లాస్‌లకు రెగ్యులర్‌గా హాజరు కావడం లేదు. ఏదో తెలియని అభద్రతా భావంతో కాలేజ్‌కి డుమ్మూ కొడుతూ వస్తున్నాడు. కాలేజ్‌తో పాటు, తాను రోజూ ప్రయాణించే ట్రైన్‌లో సైతం అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తనకు మరాఠీ రాదనే తోటి, సాటి వారు రోజూ ఎగతాళి చేయడం, టార్చర్‌ పెట్టడం భరించలేకపోతున్నాడు. ఒక రోజైతే ఆ విద్యార్థిని ట్రైన్‌లో 'వీడికి మరాఠీ రాదు' అంటూ చివరికి చేయి కూడా చేసుకున్నారు. దాంతో ములంద్‌ వెళ్లాల్సిన ఆ యువకుడు నెక్స్ట్‌ స్టేషన్‌లో దిగిపోయాడు. అదే విషయాన్ని తండ్రికి ఫోన్‌లో చెప్పాడు. ఆపై ఇంటికి వచ్చేసి ఉరేసుకున్నాడు. తండ్రి తన డ్యూటీ ముగించకుని వచ్చేసరికి విగతా జీవిలా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. భాష మాట్లాడలేదని తన కుమారుడిని కొట్టారని, భాష రాకపోవడంతో కాలేజ్‌లోనే కాకుండా ట్రైన్‌లోనే అవమానిస్తూ వచ్చారన్నాడు. ఇదే విషయాన్ని తనకు ఫోన్‌ చేసి చెప్పాడని, ఇంటికొచ్చి సరికి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలో హిందీ-మరాఠీ భాషా వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. అయితే, 2025 ఏప్రిల్ నుండి ప్రభుత్వం పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా తప్పనిసరి చేసి, హిందీని మూడో భాషగా పెట్టిన నిర్ణయం తర్వాత వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. గత నెలలో విమానంలో ముంబైకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు మరొక ప్రయాణికుడ్ని మరాఠీలో మాట్లాడమని బలవంతం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu