Ad Code

ఎలక్ట్రానిక్ స్క్రీన్లు - మధుమేహం


ప్రస్తుత కాలంలో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లతో ఉద్యోగాలు చేస్తున్నారు. ల్యాప్ టాప్ లతో యుద్దం చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్, టీవీ స్క్రీన్‌లను చూడటం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. పిల్లలు, యువత నుండి వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరూ స్క్రీన్ లను ఎక్కువగా చూస్తున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతోంది. ఈ కారణంగా డయాబెటిస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని  తాజా అధ్యయనాలలో తేలింది. వర్క్ ఫ్రం హోం చేసే వారికి స్క్రీన్ చూడాల్సి న తప్పనిసరి పరిస్థితి ఏర్పడగా, ల్యాప్ టాప్ లేదంటే కంప్యూటర్ల ముందు వాళ్లు గంటల కొద్దీ గడపాల్సి వస్తుంది. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, దీర్ఘకాలంలో అవి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. స్క్రీన్లు చూస్తూ ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. శారీరక శ్రమ లేకపోగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించడం వల్ల కొవ్వు పెరిగి కొత్త సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎక్కువ స్క్రీన్ టైం ఉండే వారిలో ఒంటరితనం వేధిస్తుంది. అలాంటి వాళ్లు అందరితో కలిసి కాసేపు మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. దీని వల్ల మానసిక సమస్యలు రావు. గంటల కొద్దీ కంప్యూటర్లు లేదంటే ల్యాప్ టాప్ ల ముందు పని చేసే అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగడం, ప్రతి గంటకు ఒకసారి వాకింగ్ చేయడం మంచిది. స్క్రీన్ టైం ఎక్కువగా కలిగిన వాళ్లు రాత్రి సరైన సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం మంచిది. ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయాలి. ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం, అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం మాను కోవాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్​టాప్ చూడటం వల్ల భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu