మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా మహరాజ్‌పురా, మాల్వా కాలేజీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. దాబ్రా నుంచి కారులో బయలుదేరిన ఐదుగురు యువకులు మాల్వా కాలేజీ సమీపంలోకి చేరుకోగానే ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తూ ముందున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఘటనలో ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదం అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పారిపోవడంతో అతడి కోసంగా గాలిస్తున్నారు.
0 Comments