Ad Code

నాలుగు నూతన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని


త్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. బనారస్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ కొత్త సెమీ-హైస్పీడ్ రైలు సర్వీసులను ఆయన జాతికి అంకితం చేశారు.ఈ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ వందే భారత్ రైళ్లు దేశంలో కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని తెలిపారు. "వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు భారతీయ రైల్వేలో ఒక నవశకానికి పునాదులు వేస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu