హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఓటరు షఫీవుద్దీన్ మాజీ మంత్రి కేటీఆర్‌పై రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0 Comments