టర్కీలోని మానిసాలో ఒక పాఠశాల ప్రిన్సిపాల్ 13 ఏళ్ల ఆటిజం విద్యార్థిని బలవంతంగా మెట్లపై నుండి క్రిందికి తోసివేసిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రిన్సిపాల్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో ప్రిన్సిపాల్ మెట్ల వద్ద వేచి ఉన్నట్లు కనిపిస్తుంది. విద్యార్థి చేయి పట్టుకుని, అతను కిందకు దిగుతుండగా నెట్టివేసినట్లు కనిపిస్తోంది. వైరల్ వీడియో తర్వాత, అధికారులు ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నారు. పోలీసలకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. పిల్లవాడికి హాని కలిగించే ఉద్దేశ్యం లేదని ఆయన కోర్టులో పేర్కొన్నాడు. టర్కీ న్యాయ మంత్రి ఈ చర్యను ఖండించారు. సమాజంలోని అత్యంత దుర్బల వర్గాలపై జరిగే ఏదైనా హింస శిక్షించబడకుండా ఉండదని న్యాయమంత్రి నొక్కి చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది.
0 Comments