అమెరికాలోని స్టోర్ లో దొంగతనం చేస్తూ మరో భారతీయ విద్యార్థిని పట్టుబడింది. స్టోర్ కీపర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వీడియోలో తాను దొంగతనం చేయలేదని డబ్బులు చెల్లించడం మర్చిపోయానని విద్యార్థిని చెబుతోంది. తనను వదిలేయాలని ఈ ఒక్కసారికి క్షమించాలని వేడుకుంటోంది. అయినప్పటికీ పోలీస్ అధికారి వినకుండా తనకు మరో ఆప్షన్ లేదని హెచ్చరిస్తున్నాడు. వినకపోతే కూర్చోబెట్టి సంకెళ్లు వేస్తానని బెదిరిస్తున్నాడు. అయినప్పటికీ విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా సేపటి వరకు అతడిని వేడుకుంది. అయినప్పటికీ వదిలిపెట్టకుండా అరెస్ట్ చేశాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ భారతీయ యువతి కూడా దొంగతనం చేస్తూ స్టోర్ యజమానులకు దొరిపోయింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఫారిన్ వెళ్లి దేశం పరువు తీస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
0 Comments