ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు బంధించి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఏడవ తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిందితుల్లో ఒకరు పరిచయమ్యాడు. ఈ వ్యక్తికి మాయమాటలు చెప్పి బాలికను మదియాన్వ్‌లోని ఐఐఎం రోడ్‌లోని ఒక హోటల్‌కు వచ్చేలా చేశాడు. అతడితో కలిసి మరో ఇద్దరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 2 రాత్రి నిందితులు బాలికను స్కార్పియో కారులో హోటల్‌కు తీసుకువచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాలికను రెండు రోజులు పాటు బందీగా ఉంచి విమల్, పియూష్ అనే ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లి తన ఫిర్యాదులో నిందితులు బాలిక శరీరాన్ని కొరికి, ఆమె మొబైల్ లాక్కుని, గదిలో బంధించినట్లు పేర్కొంది. బాలిక నిందితులను పదే పదే వేడుకున్న తర్వాత ఆమెను నిందితులు ఇంటి దగ్గర వదిలి పారిపోయారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే, వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు పియూష్, శుభం మిశ్రాలను పోలీసులు విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం పంపుతామని, దీని ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
0 Comments