Ad Code

30 ఓట్ల తేడాతో గెలిచిన బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. యాదవ్ కి 72,689 ఓట్లు (37.29%) పోలవగా.. సింగ్ కి 72,659 ఓట్లు (37.29%) సాధించారు. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇటీవల కాలంలో ఈ విజయం బీఎస్పీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఈ ఫలితం ఆఖరి వరకు ఉత్కంఠను రేకెత్తించింది. ఉత్తర ప్రదేశ్ లో 2007 నుండి 2012 వరకు బీఎస్పీ పాలన సాగింది. యూపీ సీఎంగా బీఎస్పీ అధినేత్రి మాయవతి పని చేశారు. ఆ తర్వాత నుంచి చాలా ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్, యూపీలో బీఎస్పీ తన ఖాతాను తెరవలేకపోయింది. ఇటీవలి కాలంలో బీఎస్పీకి ఇదే తొలి విజయం కావడం గమన్హారం.

Post a Comment

0 Comments

Close Menu