Ad Code

అంధుల మహిళా క్రికెట్ టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్


భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి అంధులు టీ20 మహిళా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలోని పురాతన టెస్ట్ వేదిక అయిన పి. శరవణముత్తు స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, పాకిస్తాన్ , శ్రీలంక, అమెరికా వంటి జట్లు కూడా పాల్గొన్నాయి. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 12 ఓవర్లలోనే 117 పరుగులు చేసి సునాయాసంగా మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచి తొలి ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. భారత్ తరఫున ఫులా సరెన్ (27 బంతుల్లో 44 పరుగులు) అత్యధిక స్కోరర్‌గా నిలవగా, నేపాల్ తరఫున సరితా ఘిమిరే (38 బంతుల్లో 35 పరుగులు) అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఈ టోర్నీని శ్రీలంక, భారత్ కలిసి నిర్వహించాయి.  

Post a Comment

0 Comments

Close Menu