దేశీయ మార్కెట్లో వెండి ధర మళ్లీ ఊపందుకుంది. ఒక కేజీ వెండి ధర రూ.1.73 లక్షలకు చేరింది. గత నెలలో ఒక దశలో రూ.2 లక్షలు దాటిన వెండి ధర… తర్వాత కరెక్షన్‌లో రూ.1.50 లక్షల వరకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంటూ బుల్లిష్ ట్రెండ్‌లోకి ప్రవేశిస్తోంది. రానున్న రోజుల్లో మళ్లీ రూ.2 లక్షల మార్క్ దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), 5G టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఔషధ పరికరాలు ఇలా అన్ని రంగాల్లో వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ, EV రివల్యూషన్ వేగంగా జరుగుతుండటంతో వెండి సరఫరా కొరత తలెత్తుతోంది. ఈ డిమాండ్-సప్లై గ్యాప్ వెండి ధరను పైకి నెట్టుతోంది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి… ఈ కారణాలతో డాలర్ బలహీనపడుతోంది. డాలర్ విలువ తగ్గినప్పుడల్లా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరుగుతాయి. ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితంగా భావించే వెండి వైపు మళ్లిస్తున్నారు. ధర తగ్గిన ప్రతిసారీ (డిప్‌లో) పెద్ద ఎత్తున వెండి కొనుగోళ్లు జరుగుతున్నాయి. వెండి ETFలకు భారీగా పెట్టుబడులు ప్రవాహం జరుగుతోంది. ఫిజికల్ వెండి బార్లు, నాణేల అమ్మకాలు కూడా పెరిగాయి.
0 Comments