Ad Code

బంగ్లాదేశ్ లో భూకంపం : 10 మంది మృతి, పలు భవనాలు నేలమట్టం


బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాతో పాటు మధ్య బంగ్లాదేశ్ ప్రాంతాలలో భూమి కంపించింది. దీంతో 10 మంది మృతి చెందడంతో పాటు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. దీంతో ‍అక్కడి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ భూకంపంలో దాదాపు 14 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఢాకా జిల్లా యంత్రాంగం తెలిపింది. వాటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మరోసారి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఇప్పుడు వచ్చిన భూకంపం రాబోయే భారీ భూకంపానికి సూచికగా పరిగణించాలన్నారు. దాని కనుగుణంగా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే శనివారం ఉదయం సైతం బంగ్లాలో స్పల్పంగా భూమి కంపించింది. ఢాకా నగరం ప్రపంచంలో భుకంపం వచ్చే అవకాశాలు ఉన్న తొలి 20 నగరాలలో ఒకటిగా వుంది. అంతే కాకుండా అక్కడ జనసాంద్రత అధికంగా ఉండడంతో భవనాల నిర్మాణం సైతం అధికంగా ఉంటుంది. దీంతో ఢాకాలో శిథిలావస్థకు చెందిన కట్టడాలపై నిఘా ఉంచాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ లో భారీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu