Ad Code

అదుపు తప్పి డంపర్ : అనేక వాహనాలు నుజ్జు నుజ్జు : సంఘటనా స్థలంలో 10 మంది దుర్మరణం


రాజస్థాన్‌లోని జైపూర్‌, లోహా మండి ప్రాంతంలో వేగంగా వచ్చిన ఒక డంపర్ అదుపు తప్పి అనేక వాహనాలను ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 10 మంది మరణించారు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. అదే సమయంలో ఈ దుర్ఘటనలో దాదాపు 10కి పైగా వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. పోలీసులు తెలిపి మేరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో డంపర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందున్న వాహనాలను బలంగా ఢీకొట్టాడు. దాదాపు 10 నుంచి 12 వాహనాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులో ఎక్కువగా బైక్‌లు, కార్లు, ఆటోలు ఉన్నాయి. దీంతో రోడ్డుపై భీకరమైన శబ్దాలు, ఏడుపులతో వాతావరణం విషాదకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వీరిలో ఇంకొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu