తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసివేయాలని ట్రాన్స్‌పోర్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలి. చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని పేర్కొంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలని, ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని, చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదిక ఈరోజే సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ట్రాన్స్‌పోర్ట్ శాఖ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
0 Comments