మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి వచ్చారు. ఈ ఫొటోలను చిరు స్పెషల్ గా పోస్టు చేశారు. ఈ రోజు దీపావళి వేడుకలను నా డియర్ ఫ్రెండ్స్ వెంకటేష్, నాగార్జునతో జరుపుకోవడం సంతోషంగా ఉంది. నా హృదయం జాయ్ ఫుల్ తో నిండిపోయింది. ప్రేమ, నవ్వులు, జాయ్ తో మా ఇల్లు నిండిపోయింది. ఈ దీపావళి వెలుగులు నింపాలి అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఆయన చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
0 Comments