ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ జిల్లాలోని రిషికేశ్‌లో కొందరు యువతీ యువకులు రోడ్లపైకి వచ్చారు. వీరంతా పీకల దాకా మద్యం సేవించి ఉన్నారు. మద్యం మత్తులో వీరు రోడ్డుపై వాహనాలను అడ్డగించి, సెల్ఫీలు తీసుకుందాం అంటూ హల్‌చల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. ఆ గుంపులోని ఓ యువతి అకస్మాత్తుగా రెచ్చిపోయి 'నన్ను రేప్ చేయండి' అంటూ నోటికొచ్చినట్లు అరుస్తూ, భయానక వాతావరణాన్ని సృష్టించింది. పక్కనే ఉన్న యువతీ యువకులు ఆమెను ఆపేందుకు, అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ బహిరంగ ప్రదేశంలో యువతి వ్యవహరించిన తీరు చూసి స్థానికులు, వాహనదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మద్యం మత్తులో రచ్చ చేస్తున్న ఆ యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఫ్రీడం' పేరుతో నేటి యువత దారితప్పుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడిరోడ్డుపై పదుగురి ముందు ఇలాంటి అమానవీయ పదజాలాన్ని ఉపయోగించడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదంటూ రకరకాల కామెంట్లు పెడుతూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
0 Comments