Ad Code

జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల


దేశంలోని ఐఐటిలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్  పరీక్షను నిర్వహి స్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జెఈఈ మెయిన్- 2026 మొదటి సెషన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులను శనివారం నుంచే స్వీకరించడం ప్రారంభించినట్టు ఎన్ఏ ప్రకటించింది. సీబీటీ విధానంలో జెఇఇ మెయిన్-2026ను రెండు సెషన్లలో జనవరి, ఏప్రిల్ 2026 నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి సెషన్1 కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ ఎన్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎన్డీఏ డైరక్టర్ ఎగ్జామ్స్ ప్రకటించారు. రెండో సెషన్ కి సంబంధించిన పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నిర్వహంచనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను జనవరి చివరి వారం నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ తోపాటు, మెమో ఆధారంగా ఉన్న పేర్లను నమోదు చేసుకునే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu