50 ఏళ్లుగా అమల్లో ఉన్న 'కఫాలా' వ్యవస్థ రద్దు చేస్తూ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సౌదీలోని కోటీ 30 లక్షల మంది విదేశీ వర్కర్లకు విముక్తి లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన విజన్ 2047 లో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు. దీంతో సౌదీ అరేబియా ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన భావిస్తున్నారు. కఫాలా వ్యవస్థ ఓ విధంగా మానవ అక్రమ రవాణా లాంటిది. ఇది మోడ్రన్ డే బానిసత్వంగా అభివర్ణిస్తారు. గత 50 ఏళ్లకు పైనుంచి ఈ విధానం సౌదీలో అమల్లో ఉంది. ఈ విధానంలో భాగంగా యజమానికి విదేశీ వర్కర్లపై పూర్తి అధికారం, నియంత్రణ ఉంటుంది. వారి పాస్ పోర్టులు లాక్కుని గొడ్డు చాకిరీ చేయించుకోవడమే వీరి పని. వర్కర్లను బానిసలుగా మార్చుకుని వారితో చేయకూడని పనులన్నీ చేయించుకోవడం, అలాగే తమకు ఇష్టం వచ్చిన పనిలో వారిని పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టను నానాటికీ దిగజార్చుతోందని గ్రహించిన ఆ దేశ యవరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజన్ 2030 మేరకు ఆ దేశ యువరాజు తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో సౌదీ ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు పొందడంతో పాటు పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. సౌదీలో కఫాలా వ్యవస్థ 1950 ల్లో అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన కార్మికులను మానిటరింగ్ చేయడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి వర్కర్ ను కఫీల్ (ప్రొఫెసర్) కు అప్పజెప్తారు. అతను ఆ వర్కర్ ఉపాధి, వేతనం, బస తదితర అంశాలను చూసుకుంటాడు. అయితే ఈ వ్యవస్థలో కార్మికులు తమ పై అధికారులపై ఫిర్యాదు చేయడానికి వీళ్లేదు. ఈ వ్యవస్థ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అనేకమంది భారతీయ మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. గుజరాత్, కర్ణాటకకు చెందిన మహిళలు సౌదీలో లైంగిక ఇబ్బందులు పడినప్పుడు 2017 లో కేంద్రం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ కఫాలా వ్యవస్థ ప్రస్తుతం కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్ లో అమల్లో ఉంది.
0 Comments