Ad Code

మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో నిందితుడు ఎస్సై గోపాల్ బడానే అరెస్ట్


హారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ బడానేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీడ్ జిల్లాకు చెందిన ఒక మహిళా డాక్టర్ సతారాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఫల్టాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఆమె ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఎస్ఐ గోపాల్ బడానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపణ కింద కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులు మొదట ప్రశాంత్ బంకర్‌ను పుణెలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఎస్సై బడానే ఫల్టాన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. బంకర్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎసై బడానేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రశాంత్ బంకర్, మృతురాలు నివాసం ఉంటున్న ఇంటి యజమాని కుమారుడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu