Ad Code

కునార్ నదిపై భారీ డ్యామ్‌ను నిర్మించాలని నిర్ణయించిన ఆఫ్ఘనిస్తాన్ !


పాకిస్తాన్‌కు ప్రవహించే కీలకమైన కునార్ నదిపై భారీ డ్యామ్‌ను నిర్మించి, నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయించింది. ఈ మేరకు డ్యామ్ నిర్మాణ పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబతుల్లా అఖుంద్జాదా జల, ఇంధన మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఇరు దేశాల మధ్య ఇటీవలే జరిగిన భీకర సరిహద్దు ఘర్షణల్లో వందలాది మంది మరణించిన కొన్ని వారాలకే ఆఫ్ఘనిస్తాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్ జల, ఇంధన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. విదేశీ సంస్థల కోసం ఎదురుచూడకుండా, దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచార శాఖ ఉప మంత్రి ముహాజెర్ ఫరాహీ ఎక్స్ వేదికగా తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu