Ad Code

గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య


తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్యకు పాల్పడింది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి, ఈరోజు ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చిన శ్రీవర్షిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు ఉదయం శ్రీ వర్షిత ఉపాధ్యాయురాలి సెల్ నుండి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, హాస్టల్లో ఉండలేకపోతున్నాను అని చెప్పినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నామని బదులిచ్చారు. వారు స్కూల్ కు వచ్చే లోపే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో రాంపూర్ గ్రామంలో గురుకుల పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థినిలు బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సంఘటన స్థలాన్ని ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐలు దివ్య, ప్రవీణ్ కుమార్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu