Ad Code

గో రక్షక్ దళ్ కార్యకర్త ప్రశాంత్‌పై కాల్పులు జరిపిన నిందితుల అరెస్ట్


తెలంగాణలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును చేధించామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. యమ్నంపేట్ వద్ద నిన్నకాల్పుల్లో గో రక్షక్ కార్యకర్త బిద్ల ప్రసాంత్ అలియాస్ సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. గో రక్షక్ దళ్ కార్యకర్త ప్రశాంత్‌పై కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు A1 మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషీని అరెస్టు చేశామని, అలాగే సహ నిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు A2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడన్నారు. ఇబ్రాహీం పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని, గోవుల అక్రమ రవాణా బయటపెట్టాడని ప్రశాంత్‌పై నిందితులు కక్ష పెట్టుకున్నారన్నారు. నిందితుడు ఇబ్రాహీం, బాధితుడు సోను సింగ్‌కు గతంలో పరిచయం ఉందని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇబ్రాహీం 12 సంవత్సరాలుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని, ప్రశాంత్ గతంలో ఆరుసార్లు పశువుల అక్రమ రవాణా అడ్డుకున్నాడని తెలిపారు. దాంతో ఇబ్రాహీంకు కోటి రూపాయలు నష్టం వచ్చిందన్నారు. ఈ క్రమంలో సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై ఇబ్రాహీం కక్ష పెంచుకుని కాల్పులు జరిపినట్లు   రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu