Ad Code

అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కన్స్యూమర్ ఫోరం


మెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో వీరేష్ రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ పెట్టాడు. అయితే అతనికి ఐఫోన్ 15 ప్లస్ కు బదులుగా ఐక్యూ ఫోన్ డెలివరీ చేసిన చేశారు. దీంతో షాక్ తిన్న వీరేష్ అనేక సార్లు కస్టమర్ కేర్ తో మాట్లాడాడు. అయినప్పటికి అమెజాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అతడు తన వద్ద ఉన్న ఆధారాలతో కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. దీంతో అతని ఫిర్యాదుపై విచారణ జరిపిన కన్స్యూమర్ వెంటనే బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80 వేలు రీఫండ్‌తో పాటు రూ.25 వేలు జరిమానా చెల్లించాలని అమెజాన్‌కు ఆదేశాలు ఇచ్చింది. అయితే కన్స్యూమర్ ఫోరం ఆదేశాలను అమెజాన్ సంస్థ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కన్స్యూమర్ ఫోరం అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను నవంబర్ 21 కి వాయిదా వేసింది. దీంతో ఈ ఇష్యూపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


Post a Comment

0 Comments

Close Menu