Ad Code

ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై టైరు పేలి స్లీపర్ బస్సు పూర్తిగా దగ్దం : వైరల్ వీడియో


త్తరప్రదేశ్ లోని ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నికీలల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధం అయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వరుస ప్రమాదాల ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ ఘటనను మరువక ముందే మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది.  39 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి గోందాకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే స్లీపర్ బస్సుకు మంటలు వ్యాపించిన గంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. స్లీపర్ బస్సు ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై ఢిల్లీ నుంచి గోందా వెళ్తున్న క్రమంలో టైరు పేలింది. వెంటనే బస్సులోని ప్రయాణికులను తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. అయితే మంటల్లో బస్సు తగలబడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu