బీహార్ మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరును అధికారికంగా ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రకటించాయి. తేజస్వి యాదవ్‌తో కలిసి అశోక్ గెహ్లోట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ పేరును అధికారికంగా వెల్లడించారు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు ఇండియా కూటమి ఏకంగానే ఉంది. అయితే సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడివిడిగా నామినేషన్లు వేశారు. దీంతో అధికారంలోకి వద్దామనుకున్న కూటమి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు విపక్ష కూటమి బలహీనతను అధికార కూటమి క్యాష్ చేసుకుంటోంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. సీనియర్ నాయకుడు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దింపింది. అంతే హుటాహుటినా అశోక్ గెహ్లాట్ పాట్నాలో వాలిపోయారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇంట్లో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ను ఏక కంఠంతో అంగీకారం తెలిపాయి. దీంతో కూటమిలో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పటాపంచలు అయింది. గురువారం అధికారికంగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు.
0 Comments