భారత్‌తో తమ బంధం తమ స్వతంత్ర నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్ వాదన అసంబద్దమైనదని అంటూ ఆప్ఘనిస్తాన్ రక్షణమంత్రి మవ్లావీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ వల్లే ఆప్ఘనిస్తాన్ దాడులు చేస్తోందనే వాదనపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలావి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ వ్యాఖ్యలు నిరాధారం, అశాస్త్రీయమైనది. పాక్ ఆరోపణలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆప్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా భారత్‌తో సంబంధాలను కొనసాగిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో మంచి సంబంధాలను కూడా కోరుకుంటుంది. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎవరికీ ఉపయోగపడవు. మా విధానంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఎప్పుడూ ఉండదు. పాకిస్తాన్ దోహా ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దాడులు జరిపితే ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగాన్ని ధైర్యంగా రక్షించుకుంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ముద్ర వేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. ఈ పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
0 Comments