తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కీల కుప్పంవేలూరుకు చెందిన గుణశేఖరన్, మహేశ్వరి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గుణశేఖరన్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే దీపావళి రోజున భర్త గుణశేఖరన్ తీసుకొచ్చిన చీరను తీసుకునేందుకు మహేశ్వరి నిరాకరించింది. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గుణశేఖరన్ ఆమెపై చేయిచేసుకున్నాడు. అనంతరం మహేశ్వరి ఇంటి నుంచి పొలానికి వెళ్లింది. అయితే అదే రోజు సాయంత్రం మహేశ్వరి మృతదేహం ఊరి చివరి పొలాల్లో రక్తపు మడుగులో పడి ఉండటం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ముందుగా మహేశ్వరి భర్తను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే లోతైన దర్యాప్తు చేపట్టాక మహేశ్వరి కుమారుడే ఇంతటి దారుణానికి పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించించారు. చదువుకోవాలంటూ తన తల్లి నిత్యం ఇబ్బంది పెడతున్నందుకే తల్లి పట్ల ఆ బాలుడు ఆగ్రహం పెంచుకుని ఆ దారుణానికి ప్పాలడినట్లు తేలింది. బాలుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.
0 Comments