Ad Code

రైల్వే ట్రాక్ మీద రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొని మృతి చెందిన మైనర్ బాలుడు !


డిశాలోని పూరి జిల్లాలోని జనకదేపూర్ రైల్వే స్టేషన్‌ లో ఇన్‌ స్టాగ్రామ్ రీల్ షూట్ చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొని ఒక మైనర్ బాలుడు మరణించాడు. మంగళ ఘాట్ నివాసి అయిన ఆ బాలుడు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళాడు. వారు ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. తన మొబైల్ ఫోన్‌ లో వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. రైలు బలంగా తగలడంతో బాలుడు ఎగిరిపడ్డాడు. స్పాట్ లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతడిని రైలు ఢీకొనే విజువల్స్ తన ఫోన్ లో రికార్డు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, స్థానికుల ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌ మార్టం కోసం మీపంలోని ఆసుపత్రికి పంపారు. జరిగి ఘటనపై ఆరా తీశారు. యువకుడి సెల్ ఫోన్ ను పరిశీలించారు. ప్రమాదం జరిగినప్పుడు రికార్డు అయిన విజువల్స్ ను చూశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రైల్వే లైన్ల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియో కోసం బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. రీల్ షూట్ చేస్తున్నప్పుడు రైలు వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. యువకుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu