బంగారం మీద మాదిరిగానే వెండి మీద కూడా లోన్ ఇవ్వడానికి రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమైంది. ఇవి 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. వెండి నగలు, కాయిన్స్ వంటి వాటిని తాకట్టు పెట్టుకుని లోన్ మంజూరు చేయాలని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లను తాకట్టుపెట్టడానికి అవకాశం లేదు. వీటిపై లోన్ లభించదు. ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టుపెట్టుకోవచ్చు. 500 గ్రాముల వరకు బరువున్న సిల్వర్ కాయిన్స్ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ బరువున్న వెండిని తాకట్టు పెట్టుకోకూడదని కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. మొత్తం మీద వెండిపై రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బంగారం మాదిరిగానే వెండి మార్కెట్ విలువ ఆధారంగా బ్యాంకులు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది.
0 Comments