దీపావళి సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్, పార్క్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసిన ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఢిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందినవారు కాగా, మరొకరు భోపాల్‌కు చెందినవారు. ఈ అరెస్టులతో ఢిల్లీలో జరిగే ఉగ్రదాడి తప్పిందని పోలీసులు అన్నారు. ఐఎస్‌ఐఎస్‌కు విధేయులుగా ప్రమాణం చేస్తున్న వీడియోతో పాటు ఢిల్లీలో వారు పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న ప్రదేశాల ఛాయాచిత్రాలను కూడా పోలీసులు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) ప్రమోద్ కుష్వాహ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఈడీ టైమర్‌ను తయారు చేసేందుకు వారు ఉపయోగిస్తున్న గడియారాన్ని, ఐఈడీ తయారీకి అవసరమైన వస్తువులను ఎక్కడి నుంచి కొనుగోలు చేయబోతున్నారో వాటి ఫొటోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీలో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్న చోట్ల రెక్కీ నిర్వహించామని చెప్పారు. ఇందులో దక్షిణ ఢిల్లీలోని ఒక మాల్, పార్క్ ఉన్నాయి. మొదట అక్టోబరు 16న సాదిక్ నగర్‌లో ఒక ఉగ్రవాదిని, ఆ తర్వాత భోపాల్‌లో మరో ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జ్ఞాన్వాపి మసీదును సర్వే చేస్తున్నందుకు సోషల్ మీడియాలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని బెదిరించినందుకు భోపాల్ నివాసి అయిన అద్నాన్‌ను కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉందో, వారి ప్రణాళికలను తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
0 Comments