Ad Code

కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్‌ అంబానీ


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులులక్షల కోట్ల సంపద ఉన్నా డౌన్ టు ఎర్త్ స్వభావంకలిగిఉంటారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. వారు తమ పిల్లలుఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఇషా అంబానీలో సైతంఈ విలువలను నింపారు. పిల్లల పెంపకం విషయంలో సాధారణ తల్లిదండ్రుల మాదిరిగానే కఠినంగా వ్యవహరించారు. ముఖేష్ అంబానీ ఒకసారి తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్ మెన్ కి క్షమాపణ చెప్పించారు. సిమి గరేవాల్ షోలో పేరెంటింగ్ విధానాల గురించి చర్చ సందర్భంగా నీతా అంబానీ ఆసంఘటన గురించి పంచుకున్నారు.  ఓసారి ఆకాశ్ బిల్డింగ్ వాచ్ మెన్ తో ఫోన్ లో చాలా దురుసుగా మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన ముకేశ్ అంబానీ వెంటనే ఆశాశ్ ను మందలించినట్లుగా నీతా అంబానీ వెల్లడించారు. అంతటితో ఆగకుండా కొడుకు ఆకాశ్ ను కిందకు తీసుకువెళ్లి ఆ వాచ్ మెన్ కు క్షమాపణ చెప్పించారు. ఈ విషయంలో ముకేశ్ పేరెంటింగ్ స్టైల్ చాలా కఠినంగా ఉందని నీతా వివరించారు. వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలని ముకేశ్ తన పిల్లలకు స్పష్టంగా బోధించారని తెలిపారు. అంబానీ కుటుంబంలో భాగమైనంత మాత్రాన తన పిల్లలను ఎప్పుడు హద్దు దాట నీయలేదని నీతా చెప్పుకొచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu