అమెరికా దాడుల వల్ల ఇరాన్‌లోని అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తోసిపుచ్చారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో ఖమేనీ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ సైట్‌ల విధ్వంసంపై వ్యాఖ్యలపై “కలలు కంటూ ఉండండి” అని అన్నారు. “ఒక దేశం అణు పరిశ్రమను కలిగి ఉండాలా? లేదా అని చెప్పే హక్కు అమెరికాకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. జూన్ మధ్యలో ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబు దాడులను ప్రారంభించింది. ఇరాన్‌లోని కీలకమైన అణు కేంద్రాలను ధ్వంసం చేస్తూ అమెరికా కూడా కొద్దిసేపు ఈ దాడిలో పాల్గొంది. గత వారం ఇజ్రాయెల్ నెస్సెట్‌లో ప్రసంగిస్తూ దాడుల సమయంలో ఇరానియన్ అణు స్థావరాలను నిర్మూలించినట్లు అమెరికా ధృవీకరించిందని ట్రంప్ పునరుద్ఘాటించారు. మేం ఇరాన్ కీలకమైన అణు కేంద్రాలపై 14 బాంబులను వేశాం. నేను మొదట చెప్పినట్లుగా వాటిని పూర్తిగా నిర్మూలించాం అని ట్రంప్ తెలిపారు. ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇకపై మధ్యప్రాచ్యంలో బెదిరింపుదారుడిగా మారలేదు అని అన్నారు, వారి అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం, ఇది అత్యంత విజయవంతమైన సైనిక చర్య” అని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
0 Comments