Ad Code

పెరూలో నీట మునిగిన కార్గో నౌక : సముద్రంలో పడిపోయిన 50 ఐఫోన్ 17 మొబైల్స్ కంటైనర్లు


పెరూ తీరానికి సమీపంలో ఎవర్‌గ్రీన్ షిప్పింగ్ కంపెనీకు చెందిన ఒక పెద్ద కార్గో నౌక  ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నౌకలో ఉన్న సుమారు 5 లక్షల ఐఫోన్ 17 మొబైల్స్ సముద్రంలో మునిగిపోయాయి. పెరూలోని ప్రారంభ షిప్పింగ్ లాగ్‌లు & సంబంధిత అధికారుల ప్రకారం.. ఎవర్‌గ్రీన్ నౌక చైనాలోని షెన్‌జెన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళుతుండగా కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలోనే నౌక పెరూలోని కల్లావో ఓడరేవులో షెడ్యూల్ ప్రకారం ఆగింది. అయితే బలమైన గాలులు, శక్తివంతమైన అలల కారణంగా కంటైనర్లు పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 50 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు సమాచారం. సముద్రంలో మునిగిపోయిన కంటైనర్లలో యాపిల్ ఉత్పత్తులు ఉన్నాయా? అనే విషయంపై అటు యాపిల్ కంపెనీ ఎవర్‌గ్రీన్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ కంటైనర్లు దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లకు వెళ్లే ఐఫోన్ 17 యూనిట్లతో నిండి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రూ. 4,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu