పాకిస్తాన్‌లో ఈరోజు భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో నమోదు అయ్యింది. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పాక్ అధికారులు పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదికల ప్రకారం భూకంపం 4.7 తీవ్రతతో, 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:12 గంటలకు పాకిస్థాన్‌లో ఈ భూకంపం సంభవించింది. గత శనివారం, ఆదివారం కూడా దాయాది దేశంలో 4.0 తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి. భూకంపం జరిగిన ప్రదేశాన్ని NCS తన అధికారిక X(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఉపరితల భూకంపాలు ప్రమాదకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటి భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయని, ఫలితంగా బలమైన ప్రకంపన, ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.
0 Comments