హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా మొత్తం 40 మంది జాబితాను బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్‌ఎస్, ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రచార బృందంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, పి. సబితా ఇంద్రారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యేలు కలేరు వెంకటేష్, ముత్తా గోపాల్, మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. వీరంతా రోడ్‌షోలు, పబ్లిక్ మీటింగులు, డోర్-టు-డోర్ క్యాంపెయిన్ల ద్వారా ఓటర్లను సంప్రదించి, పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి, క్యాంపెయినింగ్ వ్యూహాలను సమన్వయపరచడానికి సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్నట్లుగా, ఈ ఉప ఎన్నికలో విజయాన్ని సాధిస్తే బీఆర్‌ఎస్‌కు రాజకీయ పునరుజ్జీవనానికి నాంది అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments