Ad Code

ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో  ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా (58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్ (2/44) రెండు వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29), మిచెల్ మార్ష్ (41) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం సిరాజ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అనంతరం మాథ్యూ షార్ట్‌తో కలిసి మిచెల్ మార్ష్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే మాథ్యూ షార్ట్ (30)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా అలెక్స్ క్యారీ (24)ని శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్‌ క్యాచ్‌తో హర్షిత్ రాణా ఔట్ చేశాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్‌ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు మ్యాచ్ రేన్‌షా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే మిచెల్ ఓవెన్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా.. మిచెల్ స్టార్క్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాథన్ ఎల్లిస్(16)ను ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆడమ్ జంపాతో కలిసి కూపర్ కాన్లీ కాసేపు పోరాడాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీలు రాబట్టాడు. అతనితో పాటు జోష్ హజెల్ వుడ్(0)ను ఔట్ చేసిన హర్షిత్ రాణా ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Post a Comment

0 Comments

Close Menu