Ad Code

సౌదీ అరేబియాలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ "ల్యాండ్ బ్రిడ్జి" : డిసెంబర్ 2030 నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు


సౌదీ అరేబియాలో భారీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియాలో రైళ్లు అధిక వేగంతో నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పేరు ల్యాండ్ బ్రిడ్జి అని పిలుస్తున్నారు. దీని ఖర్చు 7 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈ ప్రాజెక్ట్ అరేబియా అంతటా ప్రయాణం, వాణిజ్యాన్ని పూర్తిగా మారుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సౌదీ విజన్ 2030 లో కీలకమైన భాగంగా విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన జనాభా కేంద్రాలను అనుసంధానించడం, సౌదీ అరేబియాను ప్రపంచ రవాణా శక్తిగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇది జెడ్డాను, రియాద్‌ను కలుపుతుందని సౌదీ అరేబియా వెల్లడించింది. ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాన్ని నేరుగా అనుసంధానించడానికి ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ ల్యాండ్ బ్రిడ్జి సుమారు 1,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఎర్ర సముద్రంపై ఉన్న జెడ్డాను అరేబియా గల్ఫ్‌లోని డమ్మామ్‌తో కలుపుతుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ రియాద్-జెడ్డా మార్గంలో ప్రయాణించే వారిపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రయాణం కారులో దాదాపు 12 గంటలు పడుతుంది, కానీ కొత్త హై-స్పీడ్ రైళ్లు ప్రారంభించిన తర్వాత అదే ప్రయాణం 4 గంటల్లోనే పూర్తవుతుందని సమాచారం. దీనివల్ల సమయం గణనీయంగా ఆదా అవుతుందని, అలాగే ఈ మార్పు ప్రయాణీకుల సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా దేశంలో ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇది సౌదీ అరేబియాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా బలోపేతం చేస్తుందని వెల్లడించారు. దేశ రైలు నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సౌదీ రైల్వే కంపెనీకి కొత్త ల్యాండ్ బ్రిడ్జి ప్రాజెక్ట్ చాలా కీలకం. సౌదీ అరేబియా తన మొత్తం రైలు నెట్‌వర్క్ పొడవును ప్రస్తుత 5,300 కిలోమీటర్ల నుంచి 8 వేల కిలోమీటర్లకు పెంచాలని చూస్తుంది. ఇది మొత్తం గల్ఫ్ ప్రాంతం, విస్తృత అరబ్ ప్రపంచానికి కీలకమైన లాజిస్టిక్స్, రవాణా కేంద్రంగా మారుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎస్ఏఆర్ ఇప్పటికే 15 కొత్త రైళ్లను ఆర్డర్ చేసింది. ఇవి గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ ప్రాజెక్ట్ జెడ్డా, రియాద్, దమ్మామ్‌లను కలిపే హై-స్పీడ్ రైలు కారిడార్‌ను ఏర్పాటు చేస్తుంది. అలాగే సౌదీ అరేబియా అంతటా ప్రయాణీకులు, సరుకు రవాణాను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా గమ్య స్థానాలకు చేరుస్తుంది. అలాగే ఈ రైల్వే లైన్ ప్రధాన పారిశ్రామిక నగరాలు, ఓడరేవులను అనుసంధానించడం, వాణిజ్యం, లాజిస్టిక్స్‌లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సౌదీ ల్యాండ్‌బ్రిడ్జి ప్రాజెక్టును డిసెంబర్ 2030 నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu