Ad Code

తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ లో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్ల నియామకం !


తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ లో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని నియమించింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా నియమించిన అధికారులు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించారు. జీపీవోలు, ఇంజినీర్లు, సర్వేయర్ల నియమకాలతో ఉపాధి అవకాశాలని తమ ప్రభుత్వం విస్తరించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని నియమించామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల కలలు కల్లలు అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu