Ad Code

మందగమనంలో తయారీ రంగం !


డిసెంబర్‌లో భారత్‌ తయారీ రంగం డీలా పడింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ డిసెంబర్‌లో 56.4కు పడిపోయింది. గడచిన 12 నెలల్లో ఇంత తక్కువ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. కొత్త బిజినెస్‌ ఆర్డర్లు, ఉత్పత్తిలో మందగమనం కనిపించిందని ఈ మేరకు వెలువడిన సర్వే పేర్కొంది. అయితే సూచీ 50పైన ఉంటే దీన్ని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. అంతకంటే తక్కువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీర్ఘకాలికంగా తయారీ సూచీ 54.1గా ఉండడం గమనార్హం. 2025లో ఉత్పత్తిలో భారీ పెరుగుదల నమోదవుతుందన్న విశ్వాసంలో తయారీదారులు ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఫిన్‌టెక్‌ కంపెనీ పేఇన్‌స్టాకార్డ్‌ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాలన్ని ప్రారంభించింది. బ్రాండిక్స్‌ ఇండియా అపారెల్‌ సిటీ ఇండియా పార్ట్‌నర్, పేఇన్‌స్టాకార్డ్‌ ఛైర్మన్‌ పచ్చిపాల దొరస్వామి, వ్యవస్థాపక సీఈవో సాయికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్యను 100కు పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సాయికృష్ణ తెలిపారు. తక్కువ లావాదేవీ వ్యయాలతో బిల్లులు, అద్దెలు, ఫీజులు మొదలైనవి చెల్లించేందుకు అనువైన సాధనంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,00,000 మంది పైగా యూజర్లకు చేరువైనట్లు వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu