మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి జిల్లాలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షంలో ఈ మావోయిస్టులు లొంగిపోయారు. లోంగిపోయిన వారిలో తార్కా సిడం సైతం ఉన్నారు. గడ్చిరోలిలో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, అలాంటి ప్రాంతంలో పోలీసులు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారన్నారు. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్చిరోలి ప్రాంతాన్ని చత్తీస్‌గఢ్‌తో అనుసంధానం చేస్తూ.. రహదారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మొబైల్ టవర్లు సైతం నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇటీవల నాగపూర్‌లో ముగిశాయి. ఈ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గత ఏడాది 33 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారని చెప్పారు. ఇక గడ్చిరోలి జిల్లా ఉత్తర భాగం పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వివరించారు. అలాగే 55 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 33 మంది లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు మూడేళ్ల కాలపరిమి విధించుకున్నామని ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేశారు. మరోవైపు గడ్చిరోలి ప్రాంతానికి చెందిన వందలాది యువత పోలీస్ శాఖలో చేరారన్నారు. వారిలో 33 మంది యువకులు మావోయిస్టులు బాధితులు ఉన్నారని వివరించారు. ఇక మావోయిస్టుల అగ్రనేతలు సైతం లొంగి పోయి జనజీవన స్రవంతిలో కలిశారన్నారు.
0 Comments