గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్‌టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో జీఎస్‌టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్‌లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది. గత నెలతో పోలిస్తే నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.16.34 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైంది. అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ సేకరణ 9 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాలు, మెరుగైన ఒప్పందాలు, వస్తువుల ఉత్పత్తి కారణంగా ఈ స్థాయి వసూళ్లు సాధ్యమైంది. దేశంలో ఇప్పటి వరకు ఇది రెండవ అత్యధిక వసూలుగా రికార్డు కెక్కింది. 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. అందులో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రభుత్వ ఖజానాలోకి రూ.21 లక్షల 51 వేల కోట్లు వచ్చాయి. కేవలం జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే.. రూ. 1.80 లక్షల కోట్లు జీఎస్‌టీ వసూలు చేశారు.
0 Comments