వాము చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వాము తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. వాముని తీసుకుంటే వికారం, వాంతులు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే వాము, బెల్లం కలిపి తీసుకుంటే కూడా చక్కటి లాభాలను పొందొచ్చు. వాము, బెల్లం కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి, పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి వంటివి ఉండవు. వాము, బెల్లం కలిపి ఆస్తమా తో బాధపడే వాళ్ళు తీసుకుంటే, ఆస్తమా బాగా తగ్గుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో వాము వేసుకుని, చిన్న బెల్లం ముక్క ని కలిపి తీసుకున్నట్లయితే, ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి, శారీరక నొప్పుల నుండి రిలీఫ్ ని పొందొచ్చు. వాము, బెల్లం కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అధిక బరువుతో బాధపడేవాళ్లు, వాము బెల్లాన్ని తీసుకోవడం మంచిది. శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే, వేడి చేసే గుణం అధికంగా ఉండడం వలన తల తిరగడం లేదంటే వాంతులు వంటివి కలగవచ్చు.
0 Comments