మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎంగా మూడోసారి ఎన్నికైన ఫడ్నవీస్ ఈరోజు సాయంత్రం ముంబై లోని అజాద్ మైదాన్ లో గవర్నర్ ఇద్దరు డిప్యూటీ సీఎం లు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ తో కలిసి ప్రమాణం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు, డిప్యూటీసీఎంలు, బీజేపీ నేతలు హాజరయ్యారు.
0 Comments