Ad Code

ఇవిఎంలపై ప్రజలకు విశ్వాసం లేదన్న శరద్‌ పవార్‌ !


హారాష్ట్ర ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని, ఇవిఎంలపై వారికి విశ్వాసం లేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. షోలాపూర్‌ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామంలో ఆదివారం నిర్వహించిన యాంటి ఇవిఎం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతాయి. కొందరు గెలుస్తారు. కొందరు ఓడిపోతారు. కానీ ఇటీవల మహారాష్ట్రలో ముగిసిన ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు. ఎన్నికల ఫలితాల విడుదలతో ఇవిఎంలపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అమెరికా, ఇంట్లాండ్‌తో పాటు పలు యూరోపియన్‌ దేశాలు బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలకు వెళుతున్నాయని, భారత్‌ మాత్రం ఇవిఎంలను వినియోగిస్తోందని అన్నారు. భారత్‌ బ్యాలెట్‌ విధానానికి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా తనకు అందించాలని, వాటిని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర సీఎంకు పంపిస్తానని శరద్‌ పవార్‌ చెప్పారు. ఇక ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ శనివారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ (ఎంవిఎ) కూటమి ఎమ్మెల్యేలు నిరాకరించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu