నయనతారకు మద్రాస్‌ హైకోర్టు నోటీసులు !


'నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌'  వివాదంలో భాగంగా నటుడు ధనుష్‌ ఇటీవల మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులపై ఆయన దావా వేశారు. న్యాయస్థానం తాజాగా దీనిపై విచారణ జరిపింది. జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్‌ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసింది. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌ 'నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌. తన పర్మిషన్‌ తీసుకోకుండా ఇందులో 'నానుమ్‌ రౌడీ దాన్‌' ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్‌ లీగల్‌ నోటీసులు పంపించారు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే నయనతార ధనుష్‌ క్యారెక్టర్‌ను తప్పుబట్టారు. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. లీగల్‌ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడంపై ధనుష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నయన్‌ దంపతులపై కోర్టులో దావా వేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org