ఢిల్లీలో వాయు కాలుష్యం మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 165గా నమోదైంది. ఆనంద్ విహార్ లో ఏక్యూఐ 178, ఛాందినీ చౌక్ వద్ద 194, ఐటీవో ప్రాంతంలో 130, వాజీపూర్ లో 152, ఓఖ్లా ఫేజ్-2 వద్ద 147, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 145, పట్పర్ గంజ్ లో 164, ఆయా నగర్ లో 107, లోధి రోడ్డులో 128, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 3 వద్ద 162, పంజాబీ భాగ్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 152గా నమోదైంది. అదే సమయంలో కొన్ని ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత పూర్ కేటగిరీలో నమోదైంది. ఆర్కేపురంలో 204, ముంద్కాలో 222, షాదీపూర్ లో 249, నెహ్రూ నగర్ లో 247, జహన్ గిర్ పురిలో 206గా గాలి నాణ్యత సూచీ నమోదైంది. గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
0 Comments