తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం వివిధ శాఖ మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల్లో హామీల్లో ఒకటైన రైతు భరోసా పథకం అమలుపై కీలక విషయాలు వెల్లడించారు. రానున్న సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించారు. రైతు భరోసా అమలుపై భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి, మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా అమలు చేస్తామని, మారీచుడు వచ్చి అడ్డుకున్నా ఆపలేరని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
0 Comments