ముంబైలోని రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను మహాయుతి కూటమి నేతలు కలిశారు. ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తదితర నేతలు కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎల్పీ నేతగా ఫడ్నవిస్ ఎన్నికైన పత్రాన్ని గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారం జరగనుంది. ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు హాజరవుతున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. షిండే కూడా ప్రభుత్వంలో ఉంటారని నమ్మకం ఉందని ఫడ్నవిస్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో 7:7:7 నిష్పత్తిలో మూడు పార్టీలు మంత్రుల పదవులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఏడుగురు, శివసేన నుంచి ఏడుగురు, ఎన్సీపీ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రి పదవులుపై చర్చించేందుకు బుధవారం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఏక్‌నాథ్ షిండే భేటీకానున్నట్లు తెలుస్తోంది. శివసేనకు సంబంధించిన ఫోర్ట్ ఫోలియోపై షిండే చర్చించనున్నారు. ఇక ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.
0 Comments