తెలంగాణలో 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈనెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబరు 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసినా వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఒక్కోపేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు తీసుకురావాలని తెలిపింది. మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, అభ్యర్థులు చెప్పులు వేసుకుని రావాలని సూచించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని తెలిపింది.
0 Comments