Ad Code

మహమ్మద్ సిరాజ్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించిన ఐసీసీ !


డిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సిరాజ్ ఒక బ్యాట్స్‌మన్‌ను అవమానించేలా లేదా అతను ఔటైన తర్వాత బ్యాట్స్‌మన్‌ను రెచ్చగొట్టే భాష లేదా సంజ్ఞలను ఉపయోగించినట్లు ఐసీసీ గుర్తించింది. సిరాజ్‌తో పాటు ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ని ఉల్లంఘించినందుకు హెడ్‌ని కూడా శిక్షించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాడు ఎవరైనా ఆటగాడు, సహాయక సిబ్బంది, అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీతో అనుచితంగా ప్రవర్తిస్తే అతనిని శిక్షిస్తారు. ఈ వివాదానికి సంబంధించి ఇద్దరు ఆటగాళ్లకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. అయితే హెడ్ కు ఆర్థికంగా జరిమానా విధించలేదు. 140 పరుగులు చేసిన తర్వాత మహమ్మద్ సిరాజ్ ట్రావిస్ హెడ్‌ని అవుట్ చేయడంతో ఈ సంఘటన జరిగింది. సిరాజ్ హెడ్ ను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సైగ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.

Post a Comment

0 Comments

Close Menu